Sat Mar 07 2026 21:18:48 GMT+0530 (India Standard Time)
దారుణం.. 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
కడప జిల్లాలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. గోపవరం మండలం రాచాయపేటలో..

ఏపీలో వరుస దారుణాలు వెలుగుచూస్తున్నాయి. రెండ్రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచార ఘటన మరువక ముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కడప జిల్లాలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. గోపవరం మండలం రాచాయపేటలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచార చేయడమే కాకుండా.. వీడియో తీస్తూ పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.
విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వారు టెన్త్, ఇంటర్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.
Next Story

