Tue Jan 13 2026 09:21:28 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు నెలల బాలుడిని కోతులు
నాలుగు నెలల బాలుడిని బిల్డింగ్ పై నుండి కిందకు పడేసిన కోతులు

బరేలీలోని గ్రామీణ ప్రాంతంలో ఒక కోతి మూడు అంతస్తుల ఇంటి పై నుండి విసిరివేయడంతో నాలుగు నెలల పసికందు మృతి చెందిందని అధికారులు తెలిపారు. బరేలీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ లలిత్ వర్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమాచారం అందిందని, విచారణ కోసం అటవీ శాఖ బృందాన్ని పంపామని తెలిపారు.
బరేలీలోని డంకా గ్రామానికి చెందిన నిర్దేశ్ ఉపాధ్యాయ్ (25) తన భార్య తన నాలుగు నెలల కొడుకుతో కలిసి తన మూడు అంతస్తుల ఇంటి టెర్రస్‌పై శుక్రవారం సాయంత్రం నడుస్తున్నట్లు చెప్పాడు. అకస్మాత్తుగా కోతుల గుంపు పైకప్పు మీదకు వచ్చింది. దంపతులు కోతులను తరిమికొట్టేందుకు ప్రయత్నించగా వారు కుమారుడిని చుట్టుముట్టారు. మెట్ల వైపు పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిర్దేష్ చేతిలో నుండి పిల్లాడు జారిపోయాడు. ఇంతలో ఒక కోతి నవజాత శిశువును పట్టుకుని పైకప్పు నుండి విసిరివేసింది. బిల్డింగ్ పై నుండి కిందకు పడడంతో పిల్లాడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story

