Wed Dec 06 2023 12:02:20 GMT+0000 (Coordinated Universal Time)
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
అతడిని చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి కారులో తీసుకెళ్తుండగా.. కొత్తపల్లి క్రాస్ వద్ద ఎదురుగా..

అన్నమయ్య జిల్లాలో గత అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది. రెండుకార్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన పెనమాల లక్ష్మయ్య (65) పక్షవాతంతో బాధపడుతుండగా.. అతడిని చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి కారులో తీసుకెళ్తుండగా.. కొత్తపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన మరో కారు ఆ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ, ఆమె కుమారుడు నర్సయ్య (41), కారు డ్రైవర్ రాజారెడ్డి (35) అక్కడికక్కడే మృతి చెందారు.చిన్నక్క (60) అనే మరో మహిళ కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో నలుగురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story