Fri Sep 13 2024 16:02:17 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : 25 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న 34 కిలోల బంగారాన్ని, 43 కిలోల వెండిని శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది.
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34 కిలోల బంగారాన్ని, 43 కిలోల వెండిని శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. ఈ ఆభరణాలకు ఎటువంటి పత్రాలు లేవు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టు అథారిటీ పోలీసులు ఈ ఆభరణాలతో పాటు నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారస్థులు కొందరు ముంబయి నుంచి భారీగా బంగారం, వెండి ఆభరణాలను విమానం ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించారు.
చౌటుప్పల్ వద్ద కూడా...
ఈ ఆభరణాలన్నీ రెండు పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారు. వీటి మార్కెట్ విలువ 25 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి బంగారాన్ని తీసుకువస్తున్నారు? ఎందుకు తీసుకువస్తున్నారన్న దానిపై విచారణ చేపట్టారు. మరో ఘటనలో చౌటుప్పల్ వద్ద డీఆర్ఐ అధికారులు పంతంగి టోల్ ప్లాజా సమీపంలో కారులో తరలిస్తున్న ఐదు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని కోల్ కత్తా నుంచి తరలిస్తున్నట్లు తేలింది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీటి విలువ 4.31 కోట్ల రూపాయలు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Next Story