Thu Dec 18 2025 12:10:12 GMT+0000 (Coordinated Universal Time)
హృదయ విదారకం.. ఆ కుక్కను చిత్రహింసలు పెట్టి చంపేశారు
ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో ముగ్గురు వ్యక్తులు కుక్క మెడను పట్టుకుని గోడకు అదిమిపట్టుకున్నారు. వారిలో ఒకరు..

ముగ్గురు వ్యక్తులు కుక్కను చిత్రహింసలకు గురిచేసి.. ఆపై ఉరివేసి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లంతా పట్టరాని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేరాలకు నెలవైన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోనీ సమీపంలోని ఎలైచిపురా ప్రాంతం ట్రోనికా సిటీలో చోటుచేసుకుంది. కుక్కను హతమార్చిన ఆ ముగ్గురు వ్యక్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో ముగ్గురు వ్యక్తులు కుక్క మెడను పట్టుకుని గోడకు అదిమిపట్టుకున్నారు. వారి ఒకరు కుక్క మెడకు గొలుసు వేసి కిందికి లాగాడు. దాంతో పాపం.. ఆ మూగజీవి నిస్సహాయ స్థితిలో నొప్పితో బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. కుక్క ఊపిరాడక కొట్టుకుంటుంటే.. ఆ నరరూప రాక్షసులు ఆనందించారు. దాని నిస్సహాయతను చూసి నవ్వుకున్నారు. చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. కాగా.. ఈ వీడియో 3 నెలల క్రితం తీసినట్టుగా తెలిసింది. వారిలో ఒక వ్యక్తిని పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Next Story

