Sun Dec 08 2024 21:59:34 GMT+0000 (Coordinated Universal Time)
ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి, 36మందికి గాయాలు
గాయపడిన 36 మందిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘెల్..
ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకేర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 36 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. 40 మంది ప్రయాణికులతో పికప్ వాహనం బర్దేభటాకు బయల్దేరింది. ఆ వ్యాన్ అంతఘర్ పోలీస్ పోస్ట్ పరిధిలోని పోడెగావ్ - లంకన్హర్ గ్రామాల మధ్యకు రాగానే.. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.
ఓ శుభకార్యానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అంతఘర్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఖోమన్ సిన్హా తెలిపారు. గాయపడిన 36 మందిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘెల్ దిగ్భ్రాంతి చెందారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితి విషమంగా ఉన్నవారికి మరింత మెరుగైన చికిత్స చేయాలని అధికారులు, వైద్యులను సీఎం ఆదేశించారు.
Next Story