Thu Mar 19 2026 11:34:12 GMT+0530 (India Standard Time)
యూపీలో దారుణం.. లారీలో కుక్కి తరలిస్తున్న ఆవులు మృతి
లారీలో ఉన్న ఆవుల్ని పరిశీలించగా.. 29 ఆవులు చనిపోయి ఉన్నాయి. ఒక్క ఆవు మాత్రమే బ్రతికి ఉంది. ఈ ఘటన స్థానికులను..

యూపీలో దారుణ ఘటన జరిగింది. ఒకే లారీలో 30 ఆవులను కుక్కి తరలిస్తుండగా 29 ఆవులు ఊపిరాడక మరణించాయి. ఈ ఘటన మథుర జిల్లాలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ లారీ నిండా ఆవులు కుక్కి ఉన్నట్లు మథుర సర్కిల్ పోలీసులకు సమాచారం అందింది. సర్కిల్ ఆఫీసర్ హర్షిత సింగ్ నేతృత్వంలోని పోలీసు బృందం వెంటనే అక్కడికి చేరుకుని లారీని అదుపులోకి తీసుకున్నారు.
లారీలో ఉన్న ఆవుల్ని పరిశీలించగా.. 29 ఆవులు చనిపోయి ఉన్నాయి. ఒక్క ఆవు మాత్రమే బ్రతికి ఉంది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికే లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఆవులు మృతి చెందిన విషయాన్ని గమనించే డ్రైవర్ లారీని ఆపి పారిపోయి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story

