Wed Mar 18 2026 21:07:18 GMT+0530 (India Standard Time)
27 సంవత్సరాల యువతిని రేప్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్
యువతిని రేప్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సారనాథ్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి పురానా పుల్ అవుట్‌పోస్ట్ ఇన్చార్జి సంగ్రామ్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ విషం తాగింది. ఈ సంఘటన తర్వాత, పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సారనాథ్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్పై అత్యాచారం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. స్టేషన్ ఇన్ఛార్జ్ అర్జున్ సింగ్‌పై చర్యలు తీసుకున్నారు పోలీస్ కమిషనర్. ఏసీపీ జ్ఞానప్రకాష్రాయ్పై కూడా ఆరోపణలు రావడంతో ఆయనను కూడా విధుల నుండి తొలగించారు. అదే సమయంలో కొత్త ఏసీపీగా రత్నేశ్వర్ సింగ్ నియమితులయ్యారు. అర్జున్ సింగ్ స్థానంలో కొత్త స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఇన్స్పెక్టర్ ధరంపాల్ సింగ్ నియమితులయ్యారు.
పెళ్లి చేసుకోవాలని కోరడానికి ఆమె అవుట్‌పోస్టుకు చేరుకోగా, నిందితుడు అక్కడ లేడు. దీంతో బాధిత యువతి విషం తాగింది. పోలీసులు వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఔట్‌పోస్టు ఇన్ఛార్జ్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై సీరియస్‌గా తీసుకున్న పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు.
Next Story

