Fri Oct 11 2024 07:40:59 GMT+0000 (Coordinated Universal Time)
లవ్ లైఫ్ చీటింగ్ కేసు.. రూ.23 లక్షలు కాజేశారు !
తలైవా డాట్ కామ్.. అనే వెబ్ సైట్ ద్వారా లవ్ లైఫ్ అనే అప్లికేషన్ ను క్రియేట్ చేసి.. ప్రీ ప్లాన్డ్ గా మోసం చేశారని వివరించారు. మొదట్లో తమ గ్రూపులో జాయిన్ అయి.. ఆన్ లైన్లోనే
కృష్ణాజిల్లా విజయవాడలో కొద్దిరోజుల క్రితం వైద్య పరికరాలను అద్దెకు ఇచ్చే ఆన్ లైన్ చీటింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకూ 22 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులు లవ్ లైఫ్ అండ్ నేచురల్ హెల్త్ కేర్ ముసుగులో ప్రజల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. తలైవా డాట్ కామ్.. అనే వెబ్ సైట్ ద్వారా లవ్ లైఫ్ అనే అప్లికేషన్ ను క్రియేట్ చేసి.. ప్రీ ప్లాన్డ్ గా మోసం చేశారని వివరించారు.
మొదట్లో తమ గ్రూపులో జాయిన్ అయి.. ఆన్ లైన్లోనే వైద్యపరికరాలు కొనుగోలు చేసిన వారికి బాగానే రిటర్న్స్ ఇచ్చి నమ్మించారు. ఆ తర్వాత వాళ్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. ఇలా చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి మోసపోయారని పేర్కొన్నారు. పైగా క్రిస్మస్ కు ఆఫర్ కూడా ఇవ్వడంతో.. ఒక్కొక్కరు రూ.50 వేలు నుంచి లక్ష రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టారని.. తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఇప్పటి వరకూ రూ.23 లక్షల రూపాయల మేర మోసం జరిగినట్లు తెలుస్తోందన్నారు.
ఈ స్కామ్ లో ఇంకా ఎంతమంది బాధితులు నగదు పోగొట్టుకున్నారో తెలియాల్సి ఉందన్నారు సైబర్ క్రైమ్ ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు. కాగా.. లవ్ లైఫ్ ను నమ్మి మోసపోయిన వారిలో ఎక్కువగా చదువుకున్న వాళ్లే ఉండటం ఆశ్చర్యపరిచిందన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రంలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా చాలామంది బాధితులున్నట్లు సమాచారం అందిందన్నారు. వెబ్ సైట్ క్రియేట్ చేసిన ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని ఇన్ స్పెక్టర్ వెల్లడించారు.
Next Story