పాక్ నటిలా నటిస్తూ 21.74లక్షల మోసం
పాకిస్థాన్ నటి పర్వరీష్ షా పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసి 21.74 లక్షల రూపాయలు కొట్టేశారు.

పాకిస్థాన్ నటి పర్వరీష్ షా పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసి 21.74 లక్షల రూపాయలు కొట్టేశారు. పర్వరీష్ షా చిత్రాలను డీపీగా పెట్టుకుని పెళ్లి చేసుకుంటామని అమాయకులను మోసం చేస్తున్నారు.
బహదూర్‌పురాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి మ్యాట్రిమోనిలో బయోడేటాను పోస్టు చేశాడు. 2023లో బాధితుడి నంబర్ ఒక మ్యాట్రిమోని గ్రూప్‌తో షేర్ అయింది. అవతలి వ్యక్తి పేరు ఫాతిమా తాను పాకిస్థాని నటి పర్వరీష్ షా అంటూ పరిచయం చేసుకుంది. పర్వరీష్ షా తో పాటు ఫాతిమా సోదరినంటూ అనీసా ఎం.హుండేకర్ కూడా పరిచయం చేసుకుంది. బాధితుడి బలహీనతలను క్యాష్ చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ఫాతిమా నమ్మించి, తన తల్లి అనారోగ్యంతో ఉందని, వైద్య ఖర్చుల కు డబ్బు కావాలని కోరింది. నమ్మిన బాధితుడు మొదట కొంత మొత్తం పంపించాడు. వాటిని రెండు రోజుల్లోనే తిరిగి చెల్లించింది. మళ్లీ డబ్బు కావాలని అడిగింది. ఇలా దశలవారీగా 21.74 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత అతడి నంబరును బ్లాక్ చేసేసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.