Fri Dec 05 2025 12:59:30 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వితంతు మహిళకు మ్యాట్రిమోనీ వెబ్సైటులో నరేష్ ఆండ్రూస్ తో పరిచయం
మహిళకు మ్యాట్రిమోనీ వెబ్సైటులో నరేష్ ఆండ్రూస్ తో పరిచయం

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ ద్వారా మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. ఓ మహిళను మోసం చేసిన కేసులో.. ఒక మహిళతో సహా ఇద్దరు నేపాలీ జాతీయులను ఢిల్లీలో అరెస్టు చేశారు. నిందితులను ద్వారక ప్రాంత నివాసి రేణుకా గుసేన్ అకా మంజు (35), ఉత్తమ్ నగర్‌కు చెందిన అమోస్ గురంగ్ అకా యాదవ్ గురుంగ్ (42)గా గుర్తించారు. వీరు గత ఆరేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నారు. వీరి నుండి 40 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, చెక్ బుక్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ మహిళ సైబర్ మోసంపై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను వితంతువునని, జీవన్సాథీ.కామ్‌లో ప్రొఫైల్‌ను క్రియేట్ చేశానని తెలిపింది. అందులో భారతదేశం వెలుపల స్థిరపడిన నరేష్ ఆండ్రూస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని ఆమె పేర్కొంది. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టాక.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆండ్రూస్ తనను పెళ్లి చేసుకునేందుకు ఇండియా వస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత భారత్‌లో దిగిన తర్వాత ముంబై కస్టమ్స్ తన కోసం ఖరీదైన బహుమతులు తీసుకురావడంతో ఆపివేసినట్లు ఆమెతో చెప్పాడు. నిందితుడు బాధితురాలితో మాట్లాడుతూ.. అతని లగేజీకి క్లియరెన్స్ రుసుము, అతను విడుదల చేయడానికి రూ. 35,000, రూ. 1,85,000 ఇలా చెల్లించాలని ఆమె నుండి డబ్బు డిమాండ్ చేశారు. నిజమని నమ్మిన మహిళ ఆ డబ్బులు వారికి పంపింది. అయితే.. డబ్బు పంపాక వారి నుండి ఎటువంటి స్పందన కనిపించలేదు. దీంతో తాను మోసపోయినట్లు ఆమె గుర్తించింది. ఇక తాను మోసపోయానని గ్రహించి.. పోలీసులకు సమాచారం అందించింది.
Next Story

