Fri Sep 13 2024 14:38:09 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని అటుగా వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో.. ఇద్దరు అక్కడికక్కడే..
విశాఖపట్నం : విశాఖ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎలమంచిలి పెట్రోల్ బంక్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని అటుగా వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో.. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read : అతనితో ప్రేమ నాకు ఎప్పుడూ స్పెషలే : బింధుమాధవి
మృతులు పాయకరావు పేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన నాని, సూరిబాబులుగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. విజయవాడలోని మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. పూజ నిమిత్తం ఆలయానికి వచ్చిన కొత్తకారు.. దూసుకెళ్లడంతో ఇద్దరు గాయపడ్డారు. కారుకి పూజ చేస్తున్న క్రమంలో యజమాని బ్రేక్ బదులు ఎక్సలేటర్ తొక్కడంతో కారు జనాలపైకి దూసుకెళ్లింది.
Next Story