Thu Mar 19 2026 07:18:22 GMT+0530 (India Standard Time)
దారుణం.. చెత్తకుప్పలో 17 పిండాలు.. బ్రూణ హత్యలా ?
మున్సిపాలిటీ చెత్తకుప్పలో ఏకంగా 17 పిండాలు పడి ఉండటం తీవ్రకలకలం రేపింది. ఉలుబేరియా మున్సిపాలిటీలో ..

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే.. అత్యంత దారుణమైన, హేయమైన ఘటన పశ్చిమబెంగాల్ లో వెలుగుచూసింది. హౌరా నగరంలోని మున్సిపాలిటీ చెత్తకుప్పలో ఏకంగా 17 పిండాలు పడి ఉండటం తీవ్రకలకలం రేపింది. ఉలుబేరియా మున్సిపాలిటీలో ఉన్న చెత్తకుప్పలో వీటిని గుర్తించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు హుటాహుటిని ఘటనా స్థలానికి చేరుకుని 17 పిండాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చెత్తకుప్పలో ఉన్న 17 పిండాలలో 10 ఆడ, 7 మగ పిండాలుగా గుర్తించారు. కాగా.. ఉలుబేరియాలో మొత్తం 30 ప్రైవేటు నర్సింగ్ హోమ్ లు ఉన్నాయి. ఈ పిండాలను మెడికల్ వేస్టేజ్ గా పడేశారా ? లేక బ్రూణహత్యలా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టమ్ రిపోర్టుల ఆధారంగా మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలున్నట్లు తెలిపారు.
Next Story

