Thu Mar 19 2026 05:48:50 GMT+0530 (India Standard Time)
క్యాసినోలో అగ్నిప్రమాదం.. 16 మంది సజీవదహనం
మృతులు, గాయపడినవారిలో ఎక్కువమంది థాయ్ లాండ్ కు చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం..

కంబోడియా దేశంలోని హోటల్ క్యాసినోలో అర్థరాత్రి సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది సజీవదహనమయ్యారు. అగ్నిప్రమాదాన్ని గ్రహించి బయటికొచ్చేలోపే భవనమంతా మంటలు చెలరేగడంతో.. 16 మంది సజీవదహనమయ్యారు. మరో 53 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. 12 గంటలపాటు శ్రమించి.. మంటలను అదుపు చేశారు.
ఎక్కువ మంది వారే..
అగ్నిప్రమాద సమయంలో.. బచావ్ బచావ్ అంటూ.. మంటల్లో చిక్కుకున్న వారు ఆర్తనాదాలు చేశారు. కొందరు భవనంపై నుండి కిందికి దూకేయగా.. గాయాలయ్యాయి. కాగా.. మృతులు, గాయపడినవారిలో ఎక్కువమంది థాయ్ లాండ్ కు చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులను గుర్తుపట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హోటల్ లో ఉన్న వారిలో చాలా మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
Next Story

