Thu Mar 19 2026 05:49:36 GMT+0530 (India Standard Time)
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్లోని రేవాలోని సుహాగి పహారీ సమీపంలో బస్సు, ట్రాలీ ఢీకొన్న ప్రమాదంలో 14 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని యూపీలోని ప్రయాగ్రాజ్లోని ఆస్పత్రిలో చేర్చారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతులంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా పోలీసులు వెల్లడించారు. దీపావళి పండుగ సందర్భంగా వారంతా తమ స్వస్థలాలకు వెళ్తున్నారని చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

