Thu Mar 23 2023 10:33:25 GMT+0000 (Coordinated Universal Time)
బస్సులో చెలరేగిన మంటలు.. 14 మంది సజీవదహనం
ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో శనివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మహారాష్ట్రలోని నాసిక్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో శనివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది సజీవదహనమయ్యారు. నాసిక్ - ఔరంగాబాద్ రహదారిపై ఉన్న హోటల్ చిల్లీ చౌక్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
బస్సులో మంటలు చెలరేగిన సమయంలో ప్రయాణికులు నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదాన్ని త్వరగా పసిగట్టలేకపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాసిక్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story