Sun Dec 08 2024 05:44:06 GMT+0000 (Coordinated Universal Time)
12 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి
ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించడంతో
చెన్నూరు పట్టణంలోని పద్మానగర్ కాలనీలో శుక్రవారం నాడు 12 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. శ్రీనివాస్, రమ్య దంపతుల కుమార్తె కస్తూరి నివృత్తి స్నానం చేసిన తర్వాత దుస్తులు ధరించి కుప్పకూలిపోయిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది.
శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా తమ్ముడితో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటుండగా, కళ్లు తిరుగుతున్నాయని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఆమెకు అంతకుముందు ఎలాంటి జబ్బు లేదని, ఇంత చిన్న వయసులో గుండెపోటుతో చనిపోవడం షాకింగ్ గా ఉందని స్థానికులు తెలిపారు.
Next Story