Tue Sep 10 2024 11:18:42 GMT+0000 (Coordinated Universal Time)
అమానుషం.. ఐదేళ్లుగా బాలికపై తండ్రి, అన్న అత్యాచారం
బాలిక చదువుతున్న పాఠశాలలో విద్యార్థినులకు ‘గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్’ కార్యక్రమం నిర్వహించి, అవగాహన కల్పిస్తుండగా..
పూణె : కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి.. కష్టమొస్తే తోడుండాల్సిన తోడబుట్టిన అన్నే ఆ బాలిక పాలిట రాక్షసులయ్యారు. ఐదేళ్లుగా తండ్రి, అన్న ఆ బాలికపై అత్యాచారం చేస్తున్నారు. వారిద్దరికీ తోడు బాలిక తాత, మామ కూడా లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరింగింది. తాజాగా వెలుగుచూసిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక (11) కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చి పూణెలో ఉంటోంది. బాలిక స్థానికంగా ఓ పాఠశాలలో చదువుకుంటోంది.
బాలిక చదువుతున్న పాఠశాలలో విద్యార్థినులకు 'గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్' కార్యక్రమం నిర్వహించి, అవగాహన కల్పిస్తుండగా.. బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని బయటపెట్టింది. 2017 నుంచి కన్నతండ్రి అఘాయిత్యానికి పాల్పడుతుండగా.. 2020 నుంచి ఆమె సోదరుడు కూడా ఈ దారుణానికి పాల్పడినట్లు వివరించింది. తాత, మామయ్య కూడా లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాలిక చెప్పడంతో.. పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే ఇది సామూహిక అత్యాచారం కాదని.. వేర్వేరు సమయాల్లో వీరంతా బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story