Fri Sep 13 2024 01:21:23 GMT+0000 (Coordinated Universal Time)
మరో దారుణం.. 10వ తరగతి విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి.. గ్యాంగ్ రేప్ !
10 తరగతి చదువుతున్న బాలిక డిసెంబర్ 23వ తేదీ గురువారం రోజూ మాదిరిగానే ట్యూషన్ కు వెళ్లింది. దారిలో ఆమెను అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు.. బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు.
మహిళలపై నేరాలు, అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఉత్తర ప్రదేశ్. తాజాగా అక్కడ జరిగిన మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి డ్రగ్స్ఇచ్చి.. నలుగురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన.. యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలోసాద్ పుర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 10 తరగతి చదువుతున్న బాలిక డిసెంబర్ 23వ తేదీ గురువారం రోజూ మాదిరిగానే ట్యూషన్ కు వెళ్లింది. దారిలో ఆమెను అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు.. బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు.
బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి..
అనంతరం బాధిత బాలికను సాద్ పుర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ నక్కి ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వీరికి తోడై.. నలుగురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రయినా బాలిక ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టగా.. అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని గుర్తించారు. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించారు. స్పృహ లోకి వచ్చిన విద్యార్థిని జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు తెలపడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరు అరెస్ట్..
బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు జనసత్ పీఎస్ ఇన్ఛార్జ్ బబ్లూ సింగ్ వర్మ తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలికకు వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాక.. నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Next Story