Thu Dec 05 2024 16:08:19 GMT+0000 (Coordinated Universal Time)
విషవాయువు లీకేజ్ 107 మందికి అస్వస్థత
రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో విషవాయువు లీక్ కావడంతో 107 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు
బాపట్ల జిల్లా నిజాంపట్నం గోకర్ణ మఠం లోని రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో విషవాయువు లీక్ కావడంతో 107 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. రొయ్యలను శుభ్రపరి చేటప్పుడు సూర్యం హైపోక్లోరేట్ ద్రావకంతో బదులు పొరపాటున హైపోక్లోరైట్ తో పాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను కలిపి క్లీన్ చేస్తుండగా...మోతాదుకు మించిక్లోరిన్ విడుదలైంది.
ఆసుపత్రిలో చికిత్స...
దీంతో ఒక్కసారిగా పొగలు రావడంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయి తీవ్ర అస్వస్తతకు గురయ్యార. శనివారం సాయంత్రానికి అస్వస్థకు గురైన బాధితుల సంఖ్య 107 మంది వరకూ ఉండవచ్చని అంచనా. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొద్ది మంది కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
Next Story