Mon Mar 23 2026 17:53:29 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
బస్సు ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు, వాహనదారులు అప్రమత్తమై.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను..

ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో జరిగిన ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వైఎన్ హోసకోట నుంచి పావగడకు వెళ్తున్న ప్రైవేటు బస్సు.. పలవలహళ్లి వద్ద బోల్తా పడింది.
బస్సు ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు, వాహనదారులు అప్రమత్తమై.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలిస్తున్నారు. బస్సులో అధికంగా విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

