Thu Sep 19 2024 00:14:50 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి
ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని చికిత్స పొందుతున్నారు.
కర్ణాటకలో కారు-బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందారు. మైసూరు సమీపంలోని తనర్సింగ్పురలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని చికిత్స పొందుతున్నారు. పూర్తిగా దెబ్బతిన్న ఇన్నోవా కారులో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తిరుమకూడ్లు-నర్సీపూర్ సమీపంలో కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టిందని మైసూరు పోలీసు సూపరింటెండెంట్ సీమా లట్కర్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
Next Story