Sat Nov 08 2025 00:17:13 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అనేక మందికి గాయాలయ్యాయి. చునార్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులను రైలు ఢీకొట్టింది. రైలు వస్తుండగా ట్రాక్ పై కి ప్రయాణికులు వెళుతుండగా రైలు వచ్చి ఢీకొట్టింది. భక్తులు ప్రయాగ్ రాజ్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ట్రాక్ దాటుతుండగా...
పొగమంచు కారణంగా రైలు కనిపించకపోవడంతో్ రైలు పట్టాలను దాటుతుండగా రైలు వచ్చి ప్రయాణికులను ఢీకొట్టింది. ట్రాక్ వైపునకు ప్రయాణికులు దిగడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అయితే పదుల సంఖ్యలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

