Thu Mar 12 2026 16:34:47 GMT+0530 (India Standard Time)
జ్యోతిష్కుడు జోస్యంతో యువతి మృతి
బెంగళూరులో దారుణం జరిగింది. చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో భయపడి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన జరిగింది

బెంగళూరులో దారుణం జరిగింది. చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో భయపడి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన జరిగింది. విద్యాజ్యోతి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. బెంగళూరులో పనిచేస్తుంది. ఆమె ఓ మంచి సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని.కొడగు ప్రాంతానికి చెందిన ప్రేమించిన యువకుడితో తొమ్మిది రోజుల కిందటే వివాహం జరిగింది. అయితే ఓ జ్యోతిష్కుడు చెప్పిన అంశాలతో తీవ్రంగా భయపడిన ఆమె చివరకు ప్రాణాలు తీసుకుంది. బెంగళూరు బాగలకుంటే ఎంఈఐ లేఔట్‌కు చెందిన విద్యాజ్యోతి బలవన్మరణానికి పాల్పడింది.
ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని...
నువ్వు ఎక్కువ కాలం భూమ్మీద మనుగడ సాగించలేవు.త్వరలోనే నూకలు చెల్లుతాయి అని వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఆమెకు ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. అక్కడితో ఆగకుండా.ఈ తొమ్మిది రోజులూ పూజలు చేయి.ఆఖరి రోజైన.నీ తాళి తీసి అమ్మవారికి సమర్పించు.ఆపై నీకు మంచి జరుగుతుంది అని తెలిపాడు.ఆయన మాటలకు విపరీతంగా భయపడిపోయిన ఆమె అలానే పూజలు చేసి.తొమ్మిదో రోజు అమ్మవారికి తాళి తీసివ్వడానికి ముందు గదిలోకి వెళ్లింది.అనంతరం తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుంది.జ్యోతిష్యడు పై కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

