Road Accident : కారుపై ... ట్యాంకర్...ఘోర ప్రమాదం
కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా టోల్ ప్లాజా సమీపంలో కారుపై ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు ఎల్లారెడ్డి గూడెంకు చెందిన శ్రీనివాసరావుదిగా పోలీసులు గుర్తించారు. కారు పైన ట్యాంకర్ పడటంతో కారు నుజ్జు నుజ్జయింది. అయితే కారులో ఎంత మంది ఉన్నారు? వారు బతికే ఉన్నారా? అన్న విషయం తెలియలేదు.
కారులో ఎందరున్నారన్నది?
ట్యాంకర్ ను పక్కకు తప్పించేందుకు పోలీసులు క్రేన్లను తెప్పించి ప్రయత్నాలు చేస్తున్నారు. బీఎండబ్ల్యూ కారు నెంబరు TS 09 FT 6662 గా ఉంది. ట్యాంకర్ పై 16 చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ రిజిస్ట్రేషన్ తో తమిళనాడులో ఈ ట్యాంకర్ ఎక్కువగా తిరుగుతుందని చెబుతున్నారు. కారులోనే ప్రయాణికులున్నారు. వారి పరిస్థితి ఏంటో అన్నది బయటకు వస్తే కాని తెలియదని పోలీసులు చెబుతున్నారు.

