Fri Dec 26 2025 06:34:51 GMT+0000 (Coordinated Universal Time)
లోయలో పడిన బస్సు.. పది మంది మృతి
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. మెక్సికోలోని వెరాక్రూజ్ లో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది పెద్దలు, ఒక చిన్నారి మరణించారు. అతి వేగంతో అదుపు తప్పి పక్కనే ఉన్న భారీ లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముప్ఫయి రెండు మందికి గాయాలయ్యాయి.
32 మందికి గాయాలు...
స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 32 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది. అతి వేగంతో ప్రయాణించడం వల్లనే బస్సు అదుపు తప్పి లోయలో పడిందని పోలీసుల తెలిపారు.
Next Story

