Fri Apr 10 2026 22:23:12 GMT+0530 (India Standard Time)
Road Accident : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్డంతో కారులో ఉన్న ముగ్గురు మరణించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదం కారు అతివేగం వల్లనే జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
వరంగల్ జిల్లాకు చెందిన..
కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మృతులను వరంగల్ జిల్లాకు చెందిన శ్రీధర్ రావు, లక్ష్మి, అద్వికగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

