Sat Dec 06 2025 20:39:54 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు నిరాశ
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో అంతే పెరుగుదల కనిపించింది

బంగారం రల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఎక్కువ సార్లు పెరుగుతూనే ఉంటాయి. చాలా తక్కువ సార్లు మాత్రమే తగ్గుతుంటాయి. తగ్గినా అతి తక్కువగా, పెరిగితే భారీగా ధరలు పెరగడం బంగారానికి అలవాటు. అందుకే తగ్గిందని సంతోషించేలోగా, బంగారం ధరలు పెరిగినప్పుడు బాధపడటం కూడా అంతే స్థాయిలో జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న వివిధ పరిణామాలతో పాటు డాలర్ తో రూపాయి విలువ తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత బంగారం ధరల పెరుగుదలకు ఇక ఫుల్ స్టాప్ పడలేదు. గత కొన్ని రోజుల నుంచి వేల రూపాయల బంగారం ధరలు పెరిగిపోయాయి.
భారీగా పెరగడంతో...
ఈ ఏడాది జనవరి ఒకటోతేదీ నుంచే బంగారం ధరలు పెరుగుదలను మొదలు పెట్టాయి. రెండు నెలలవుతున్నా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 88 వేల కు చేరువలో ఉంది. కిలో వెండి ధర లక్షా ఎనిమిది వేల రూపాయలు పలుకుతుంది. ఇంకా ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉండటం, బంగారం నిల్వలు తక్కువగా ఉండటం, విదేశాల నుంచి బంగారం దిగుమతులు లేకపోవడం వంటి కారణాలతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో కొనుగోళ్లు మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు పెరిగి...
పెరిగిన ధరలను చూసి బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయాలంటే ఎవరూ ముందుకు రాకపోవడంతో జ్యుయలరీ దుకాణాలు కూడా కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. అదే సమయంలో ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో అంతే పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,560 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,880 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,08,100 రూపాయలుగా కొనసాగుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.
Next Story

