Fri Dec 05 2025 18:53:35 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : తగ్గినా తగ్గినట్లు కాదు.. బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలిస్తే?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి.

పసిడి అంటే అందరికీ ఇష్టమే. ఇష్టం లేని వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అటువంటి పసిడి పరుగులు తీస్తూనే ఉంటుంది. గత పదేళ్లలో పసిడి ధర ఎంత పెరిగిందో వెనక్కు తిరిగి చూసుకుంటే మాత్రం కళ్ల వెంట నీళ్లు రాకమానవు. అప్పుడు పెట్టుబడి పెట్టి ఉంటే బంగారం రూపంలో లాభం తెచ్చిపెట్టి ఉండేదని భావించే వారు అనేక మంది ఉన్నారు. ఇంకో పదేళ్లు వెనక్కు వెళితే మరింత ఆశ్చర్య పోతారు. 2000 సంవత్సరం ఉన్న పది గ్రాముల బంగారం ధరకు, నేడు ఉన్న బంగారం ధరకు అసలు పొంతనే లేదు. నాడు పది వేల రూపాయల లోపు ఉన్న బంగారం ధర నేడు లక్ష రూపాయలు దాటేసిందంటే పది రెట్టు పెరిగిందంటే ఎంత లాభమో ఊహించుకుని వాపోవాల్సిందే.
భద్రత అని భావించినా...
అందుకే బంగారంపై పెట్టుబడి ఎప్పటికీ సురక్షితమని అంటారు. అందుకే ఎక్కువగా భూమి, బంగారంపైనే తమకున్న కొద్దిపాటి డబ్బులు పెడతారు. భూమి కంటే బంగారాన్ని మరింతగా ఎందుకు ఇష్టపడతారంటే దానిపై సులువుగా కుదువ పెట్టి రుణం తీసుకునే వీలుంది. బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేట్లకే లభిస్తుండటం కూడాఇందుకు కారణం. తమకు కష్టసమయంలో బంగారం ఆదుకుంటుందని, బంగారం భద్రతగా నిలుస్తుందని నమ్మకం భారతీయుల్లో ఎక్కువగా కనపడుతుంది. కొందరు సౌందర్యం కోసం ఆభరణాలను కొనుగోలు చేస్తుండగా, మరికొందరు పెట్టుబడిగా చూసే ఎక్కువగా బంగారాన్ని తమ వద్ద డబ్బులు ఉన్న సమయంలో దానిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు.
కొంత తగ్గుతున్నా...
అటువంటి బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. రోజులు కాదు.. నెలలు అనే చెప్పాలి. ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభమయిన పెరుగుదల ఇంకా ఆగేటట్లు కనిపించడం లేదు. అయినా కొనుగోళ్లు తగ్గినా బంగారం ధరలు మాత్రం పూర్తి స్థాయిలో దిగి రావడం లేదు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 92,790 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల బంగారం ధర 1,01,230 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1, 26, 200 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

