Thu Dec 18 2025 07:28:54 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : అడ్డూ అదుపూ లేకుండా ఇలా పెరుగుతుంటే ఎలా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి

పసిడికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అది ఎంత మాత్రం తగ్గదు. తరాలు మారుతున్నా... బంగారంపై మక్కువ మాత్రం ఎవరికీ తగ్గడం లేదు. దీనికి కారణం.. పసిడిని కేవలం ఆభరణాలుగా మాత్రమే చూడటం కాదు. స్టేటస్ సింబల్ గానూ... పెట్టుబడిగానూ చూస్తుండటంతో ఎన్ని తరాలు మారినా... కొత్త తరాల్లో కూడా బంగారం ధరల పట్ల మక్కువ తగ్గలేదనడానికి కారణం కొనుగోళ్లు తగ్గకపోవడమే. అందుకే బంగారం ఎవర్ గ్రీన్ గా అమ్ముడు పోయే వస్తువుగా భావిస్తారు. అందుకే జ్యుయలరీ దుకాణాలు అన్ని వెలుస్తున్నాయి.
పెరుగుదలకు...
సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు అలా కాదు. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు కూడా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులకు కారణాలుగా చెబుతున్నారు. ధరల్లో రోజూ మార్పులు చేసుకుంటున్న కారణంగా ఇవి పెరగడమే తప్ప తగ్గడం చాలా అరుదుగా కన్పించే విషయం. అందుకే బంగారం భవిష్యత్ లో కొందరికే అందుబాటులో ఉంటుందన్నది కూడా అంతే వాస్తవం.
భారీగా పెరిగిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 270 రూపాయలు మేరకు పెరిగింది. వెండి కూడా అదే బాటలో పరుగులు తీసింది. కిలో వెండి ధరపై పద మూడు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,350 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,560 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 81,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story

