Sun Feb 09 2025 20:50:08 GMT+0000 (Coordinated Universal Time)
Godl Price Today : బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి.. ఆనందం ఆవిరి చేశాయిగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ధరలు తగ్గడం అనేది అరుదుగానే జరుగుతుంటుంది. ఎక్కువ సార్లుధరలు పెరగడమే చూస్తుంటాం. మరో రెండు రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ భారీగా పెరిగింది. డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ఒకసారి తగ్గినా స్వల్పంగానే తగ్గడం, ఎక్కువ సార్లు పెరుగుతూ అధికంగా ధరలు పెరగడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. కానీ కొనకుండా ఉండలేని పరిస్థితి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు భారతీయ సంప్రదాయం ప్రకారంబంగారం, వెండి వస్తువులను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి రావడంతో ఉన్నకొద్దిపాటి మొత్తాన్ని బంగారంపైనే పెడుతున్నామని వాపోతున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి...
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి బంగారం ధరలు మరింతగా పెరగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే దీర్ఘకాలంలో్ పెట్టుబడి పెట్టేవారికి బంగారం కంటే మించిన వస్తువు ఏదీ లేదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాదికి ఖచ్చితంగా పది గ్రాముల బంగారం ధరలు లక్ష రూపాయలకు చేరుకునే అవకాశముండటంతో ఇప్పుడే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఏడాది క్రితం వరకూ నలభై ఏడు వేల రూపాయలు ధర ఉన్న బంగారం ధర ఈ ఏడాదిలోనే దాదాపు ముప్ఫయివేల రూపాయలు పెరగడాన్నిపలువురు గుర్తు చేస్తున్నారు. అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టే వారు సురక్షితమైనదిగా భావించి పెట్టుబడి పెడితే మంచిదని చెబుతున్నారు.
నేటి ధరలు...
బంగారానికి ఉన్నడిమాండ్ మరే వస్తువుకు లేదు. అయితే పెరుగుతున్నబంగారం, వెండి ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలా ధరలు పెరుగుతూ పోతే ఎలా కొనుగోలు చేయగలమంటూ ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు వ్యాపారులు మాత్రం ధరల పెరుగుదల ప్రభావం కొనుగోళ్లపై పడుతుందని భావించి ఆందోళన చెందుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,560 రూపాయలుగా ఉంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 83,430 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 93,400 రూపాయలుగా ఉంది.
Next Story