Fri Dec 05 2025 18:04:28 GMT+0000 (Coordinated Universal Time)
ఇక ఆగేట్లు లేవే
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.170లు పెరిగింది

పసిడికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. పెరగడమే కాని బంగారానికి గిరాకి తగ్గనే కాదు. ఇదే సూత్రం బంగారం ధరలు పెరగడానికి కారణమవుతాయని చెప్పాలి. బంగారం స్టేటస్ సింబల్ గా మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కావడంతో పసిడి కొనుగోళ్లు మాత్రం ఎప్పుడూ మందగించవు. అందుకే జ్యుయలరీ దుకాణాలు నిత్యం కస్టమర్లతో కళకళలాడుతుంటాయి. ఇంకా జ్యుయలరీ దుకాణాలు ప్రకటిస్తున్న అదిరిపోయే ఆఫర్లతో రెట్టింపు ఉత్సాహంతో కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
భారీగా పెరిగి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.170లు పెరిగింది. వెండి కిలో మూడు వందల రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,200 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,220 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర మాత్రం భారీగా పెరిగి ప్రస్తుతం మార్కెట్ లో 78,300 రూపాయలకు చేరుకుంది.
Next Story

