Thu Feb 13 2025 23:26:30 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : గుడ్ న్యూస్.. ఎన్నిరోజులకు బంగారం ధరలు తగ్గయిరా బాబూ
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

బంగారం ధరలు అమాంతం పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. మరో నాలుగు రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో ఏం చేయాలో తెలియక పాలుపోక కొనుగోలు చేయాలా? వద్దా? అని మీమాంసలో ఉన్నారు. పది గ్రాముల బంగారం ధర 82 వేల రూపాయలు దాటింది. కిలో వెండి ధర 1,03 వేల రూపాయలు కూడా మించి పలుకుతుంది. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అంత డబ్బు పెట్టినా గ్రాము బంగారం కూడా రాకపోవడంతో కొనుగోలు దారులు గత కొంతకాలంగా దుకాణాల వైపు చూడటం మానేశారంటున్నారు వ్యాపారులు.
వ్యాపారాలు తగ్గడంతో...
తద్వారా వ్యాపారాలు కూడా తగ్గాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం, వెండి ధరలు పెరిగిగే ఆటోమేటిక్ గా దాని ప్రభావం కొనుగోళ్లపై పడుతుందని అందరికీ తెలిసిందే. ఆ సూత్రం ప్రకారమే బంగారం కొనుగోళ్లు గత కొంతకాలం నుంచి తగ్గాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాలనుకునేవారికి ధరలు బూచిలా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ధరలు మరింత పెరుగుతాయని ముందుగానే అంచనాలు వేశారు. అందుకు అనుగుణంగానే ధరలు కూడా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు బంగారం, వెండి వస్తువుల కొనుగోలు విషయంలో వెనక్కు తగ్గారు.
భారీగా తగ్గి...
ఇక వచ్చే ఏడాదికి బంగారం ధరలు పది గ్రాములు లక్ష చేరుకుంటుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అది ఎంతో దూరం లేదనిపిస్తుంది. అందుకు తగినట్లుగానే ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 620 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర దాదాపు ఏడు వేల రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరుగంటలకు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,000 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,080 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర1,03,900 రూపాయలకు చేరుకుంది.
Next Story