Fri Dec 05 2025 13:49:36 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : దీపావళికి పసిడి ధరలు పెరుగుతాయట.. ఇప్పుడే కొనుగోలు చేయండి
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

దసరా వెళ్లింది. త్వరలో దీపావళి వస్తుంది. దీపావళి పండగతో పాటు ధన్తెరాస్ కూడా వస్తుంది. దీంతో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు బాగా బులియన్ మార్కెట్ లో వినిపిస్తున్నాయి. అందుకే అవసరమైన వాళ్లు, పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వారు ముందుగానే బంగారం, వెండి కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. రానున్నది పెళ్లిళ్ల సీజన్ తో పాటు పండగ సీజన్ కూడా కావడంతో ధరలు ఎవరి చేతుల్లో ఉండవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారీగా ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే బంగారం ధరలు పెరిగాయి. వెండి కిలో ధర లక్ష రూపాయలు దాటింది.
తగ్గని డిమాండ్...
బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అది తగ్గనే తగ్గదు. అందులోనూ భారతీయ మార్కెట్ లో బంగారానికి సంబంధించి నిత్యం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పండగలు, పబ్బాలతో పనిలేదు. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు బంగారం కొనుగోలు చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. అందుకే బంగారానికి డిమాండ్ 24/7 ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్ లోకి కొత్త డిజైన్లు వచ్చినప్పుడల్లా వాటిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. బంగారం అంటే తేలిగ్గా అమ్మగలిగిన వస్తువు కావడం, కుదువ పెట్టి ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చన్న కారణం కూడా కొనుగోళ్లకు ఒక కారణంగా చూడాలి.
నేటి ధరలు ఇలా...
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. అయితే రానున్న కాలంలో ఈ ధరల నియంత్రణ ఎవరి అదుపులో ఉండదంటున్నారు నిపుణులు. అందుకే బంగారం కొనుగోలు చేయదలిచిన వారు సీజన్ ప్రారంభం కాకముందే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,940 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 77,390 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,02,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story

