Mon Dec 08 2025 12:22:06 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా మార్పు కనిపించింది

బంగారం ధరలు ఒక్కోసారి పెరుగుతుంటాయి. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అయితే ప్రతి రోజూ ధరల్లో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఉదయం ఆరు గంటల ధరలకు మధ్యాహ్నానికి మారిపోతుంటాయి. అందుకే బంగారం ధరలను చూసి ఒక రోజు ఆగుదాంలే అనుకునే వారికి షాకిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వెయిట్ చేయడం అవసరం. ధరలు ఎంతైనా కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే పసిడి, వెండి ధరలు పెరగడమే కాని తగ్గడం అంటూ అస్సలు జరగనే జరగదు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. అలాగే దేశీయంగా కూడా అధిక డిమాండ్ ఉండటంతో ఎప్పటికైనా ధరలు పెరిగేవే కాని తగ్గవన్నది వాస్తవం.
రెండు నెలల పాటు...
ఇక నవంబరు, డిసెంబరు నెలల్లో మంచి ముహూర్తాలున్నాయి. నవంబరు నెల నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. పెళ్లిళ్లు కూడా అత్యధిక సంఖ్యలో జరుగుతాయని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల పెళ్లిళ్లు ఈ రెండు నెలల్లో జరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతుండటంతో పుత్తడి ధరలకు రెక్కలొచ్చే అవకాశముంది. భారీగానే పెరిగినా పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బంగారం సామాన్యులకు భారం అయిపోతుంది. అందుకే ముందుగా కొనుగోలు చేయదలచుకున్న వారికి ఇదే మంచి సమయమని కూడా పలువరు సూచిస్తున్నారు.
స్వల్పంగా తగ్గినా...
బంగారం అంటేనే దక్షిణ భారత దేశంలో మక్కువ ఎక్కువ. ఇక్కడ అత్యధికంగా కొనుగోళ్లు నిత్యం జరుగుతుంటాయి. కోట్లాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ప్రతి రోజూ అమ్ముడవుతుంటాయి. ఈరోజు మాత్రం పసిడి ప్రియులకు కొంత గుడ్ న్యూస్ అని చెప్పాలి. నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా మార్పు కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,190 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,660 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,02,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story

