Mon Dec 08 2025 11:08:29 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మహిళలు విస్తుపోయే న్యూస్.. బంగారం ధరలు ఇంత తగ్గాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు అంటేనే పైపైకి ఎగబాగుతుంటాయి. వాటిని ఆపడం ఎవరి తరమూ కాదు. అనేక కారణాలతో పసిడి, వెండి ధరలు ప్రతి రోజూ మార్పులు జరుగుతుంటాయి. తగ్గితే తక్కువగా, పెరిగితే భారీగా పెరగడం బంగారానికి అలవాటు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయి. దిగుమతుల ప్రభావం కూడా బంగారం ధరలపై ఉంటుందని మార్కెట నిపుణులు చెబుతుంటారు. ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువుకు ధరలు పెరుగుతుండటం సహజమని అంటుంటారు.
ఆఫర్లు ప్రకటించినా...
కానీ బంగారం విషయంలో గత కొద్ది రోజులుగా ధరలు పెరగడమే కాని తగ్గడం జరగడం లేదు. మగువలు అమితంగా ప్రేమించే బంగారాన్ని కొనుగోలు చేయడం ఇక కష్టమేనని అనిపించేంతంగా ధరలు చేరుకున్నాయి. గతంలో కొనుగోలు చేసిన బంగారానికి తరుగు పోను మార్చుకుందామనుకున్నా సరైన ఆభరణం వచ్చేట్లు కనిపించడం లేదు. జ్యుయలరీ దుకాణాలు అనేక ఆఫర్లు ప్రకటించినప్పటికీ అవసరమైన వారు తప్ప బంగారాన్ని కొనుగోలు చేయడం హాబీగా ఉన్న వారు మాత్రం మానుకున్నారు. బంగారంపై పెట్టే సొమ్ము ఇతర చోట్ల మదుపు చేయడం మంచిదన్న భావనతో వారు కొనుగోలుకు పెద్దగా ఇష్టపడటం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
తగ్గిందిగా...
పసిడి ధరలు అంటేనే దిగిరావు అన్నది వినియోగదారులందరికీ తెలుసు. అయినా బంగారాన్ని సొంతం చేసుకోవడానికి కొందరు నిత్యం పరితపిస్తూనే ఉంటారు. దీంతో పాటు పెట్టుబడిగా, మదుపు చేసే వారు కూడా పసిడిపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. దీంతో ధరలు పెరిగినా బంగారం, వెండి కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,140 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,610 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధరల 1,02,900 రూపాయలుగా ఉంది.
Next Story

