Sat Dec 06 2025 23:19:18 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : గుడ్ న్యూస్.. పుత్తడి ధరలు నేల చూపులు .. ధర ఎంతో తెలిస్తే?
ఈరోజు దేశంలోబంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగి వినియోగదారులను షాక్ కు గురి చేస్తున్నాయి. ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి వాటితో పాటు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే పరుగు అందుకున్న పసిడి ధరలు ఇక ఆగకుండా పరుగు పెడుతూనే ఉన్నాయి.
కొనుగోళ్లు తగ్గడంతో...
గత కొంతకాలం నుంచి ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు చేసేవారు కూడా ఒకింత వెనకడుగు వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ తో పాటు శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలు కూడా రావడంతో బంగారం, వెండి వ్యాపారం మరింత జరుగుతుందని భావించిన వ్యాపారులకు పెద్దగా గిరాకీ లేదు. వచ్చినవాళ్లు ధరలను చూసి తాము కొనుగోలు చేయాలనుకున్న దాని కంటే తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి వెళుతున్నారు. అయితే బంగారం సురక్షితమైన సంపదగా భావించి పెట్టుబడులు పెట్టే వారు మాత్రం ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాదికి పది గ్రాముల బంగారం ధరలు లక్ష రూపాయలకు చేరుకునే అవకాశముందని చెబుతుండటంతో వారు కొనుగోలు చేస్తున్నారు.
కొద్దిగా తగ్గి...
బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే వస్తువులు కావడంతో వీటికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. డిమాండ్ తగ్గని ఒకే ఒక వస్తువు బంగారంగా చెప్పుకోవాలి. ఈరోజు దేశంలోబంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,540 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,410 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర మాత్రం 1.04,900 రూపాయలుగా నమోదయింది.
Next Story

