Mon Oct 14 2024 04:49:13 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : ఫెస్టివల్ కు గుడ్ న్యూస్.. మహిళలకు బంగారం ఇక చౌకగానే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది.
పసిడి అంటే పడి చచ్చిపోయే వారు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. అందులోనూ దక్షిణ భారత దేశంలో మహిళలు అత్యంత ఇష్టపడే వస్తువు బంగారం. అందులో మరేది లేదు. ల్యాండ్, గోల్డ్ కు ఉన్న విలువ మరి దేనికి ఉండదు. ధరలు పెరగడమే తప్పించి తగ్గడం అనేది జరగదు. అందుకే బంగారాన్ని పొదుపుకు ఒక వస్తువుగా కూడా అనేక మంది చూస్తారు. పెట్టుబడిగా చూసేవాళ్లు అనేకమంది ఉన్నప్పటికీ కొందరు స్టేటస్ సింబల్ గా కూడా భావిస్తారు. అందుకే పసిడికి అంత దేశీయంగా డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. దేశంలో ఇబ్బడి ముబ్బడిగా జ్యుయలరీ దుకాణాలు వెలుస్తున్నాయంటే దానికి ఉన్న డిమాండ్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు.
బంగారం విషయంలో...
అన్ని విషయాల్లో ఆచితూచి బేరమాడే మహిళలు బంగారం విషయంలో నోరెత్తకుండా కొనుగోలు చేస్తారు. ఎందుకంటే దానిని అత్యంత విలువైన వస్తువుగా భావించడంతోనే బంగారం కొనుగోలుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోరు. ధరలు పెరుగుదలతో సంబంధం లేదు. కొన్నామా? లేదా? సొంతం చేసుకున్నామా? లేదా? అన్న ఆలోచనతోనే బంగారం దుకాణాల్లోకి అడుగుపెడతారు. జ్యుయలరీ షాపుల్లో అడుగుపెట్టిన మహిళల ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. అందులో పండగ సీజన్ ప్రారంభం కావడంతో బంగారం, వెండి కొనుగోళ్ల పట్ల మహిళలు మరింత ఆసక్తి కనపరుస్తారని వ్యాపార వర్గాలు అన్ని సిద్ధం చేసుకుంటున్నాయి.
స్వల్పంగానైనా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఇది ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న ధరలు మాత్రమే. సాయంత్రానికి పెరిగే అవకాశముంది. ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర70,490 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,900 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర ఈరోజ. 94,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story