Wed Feb 12 2025 07:59:51 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : గోల్డ్ లవర్స్ కు ఇంతకంటే మంచి టైం దొరుకుతుందా మరి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలలో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది

బంగారం ధరలకు పెరగడమే తప్ప తగ్గడం అస్సలు తెలియదు. ఎందుకంటే దానికున్న డిమాండ్ అలాంటిది. బంగారం, వెండి వస్తువులతో భారతీయులకు బంధం ఈనాటిది కాదు. దశాబ్దాల నుంచి ఆ బంధం పెరగడమే తప్ప తరగడం లేదు. బంగారాన్ని ఒక అపురూపమైన వస్తువుగా భావించడం మొదలయిన నాటి నుంచి వీటి కొనుగోళ్లు మరింత పెరిగాయి. నిల్వలు తగినంత లేకపోవడంతో డిమాండ్ కు సరిపడా బంగారం, వెండి దొరకకపోవడం వల్ల కూడా ధరల పెరుగుదల కు కారణమని చెబుతున్నారు.
అందరి వస్తువుగా...
బంగారం అనేది ఒకప్పుడు విలాసవంతమైన వస్తువుగా చూసేవారు. అధిక బంగారం కొనుగోలు చేసే వారు కొద్దిగా డబ్బున్న వారే కనపడే వారు. ఇప్పుడు బంగారం అందరి వస్తువుగా మారింది. అందుకు కారణం కొనుగోలు శక్తి పెరగడంతో పాటు జ్యుయలరీ దుకాణాలు బంగారాన్ని సొంతంచేసుకోవడానికి అనేక సులువైన మార్గాలు జనం ముందు ఉంచడం కూడా మరొక కారణమని అనుకోవచ్చు. బంగారం, వెండి ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు.
స్వల్పంగా తగ్గి...
ఈర్ోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలలో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,590 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,640 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 96,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story