Fri Jan 30 2026 23:30:26 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : హమ్మయ్య కొంత శాంతించిందిగా.. దయ చూపించిన పుత్తడి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి.

బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ పోతున్నాయి. ఒకప్పుడు పండగలు, శుభకార్యాలకు మాత్రమే బంగారం కొనుగోలు చేసే వారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు పడితే అప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. స్టేటస్ సింబల్ గా భావించడంతో బంగారం, వెండి వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటతో ధరలు కూడా పెరుగుతున్నాయి. బంగారం నిల్వలు తగినంతగా లేకపోవడం, డిమాండ్ మాత్రం అధికంగా ఉండటంతో ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతూనే ఉంటాయి. అది ఏ వ్యాపారంలోనైనా ఏ వస్తువుకైనా ఉండే లక్షణమని అందరూ గుర్తించాలి.
ఫ్యాషన్ గా మారి...
బంగారం, వెండి ఒకప్పుడు అవసరాలకు మాత్రమే కొనుగోలు చేసేవారు. కానీ రాను రాను గోల్డ్ జ్యుయలరీ కొనుగోలు ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడంతో పాటు సాఫ్ట్వేర్ జాబ్ లు రావడంతో అందరూ బంగారాన్ని ఎగబడి కొనుగోలు చేయడం ప్రారంభించారు. అందుకే జ్యుయలరీ దుకాణాలు ఎప్పుడూ కిటకిటలాడుతున్నాయి. శుభకార్యాలతో నిమిత్తం లేకుండా చివరకు పుట్టిన రోజు నాడు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో గిరాకీ పెరిగింది. మహిళలు అత్యంత ఇష్టపడే బంగారాన్ని కొనుగోలు చేయడం ఎక్కువ కావడంతో కొత్త కొత్త డిజైన్లతో వ్యాపారులు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
స్వల్పంగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి. ఇక వచ్చే నెల నుంచి బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుండటంతో ముహూర్తాలు, శుభకార్యాలు మొదలవుతాయి. ఈరోజు పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,830 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,100 రూపాయలుగా ఉంది.
Next Story

