Sat Dec 13 2025 22:33:51 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : గుడ్ న్యూస్... హైదరాబాద్ లో టీసీఎస్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్ లో టీసీఎస్ భారీ పెట్టుడులకు సిద్ధమయింది

హైదరాబాద్ లో టీసీఎస్ భారీ పెట్టుడులకు సిద్ధమయింది. ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి దాదాపు 8,820 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది.టీసీఎస్ తన కొత్త AI డేటా సెంటర్ వ్యాపారం హైపర్ వాల్ట్ కోసం ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీతో ఒప్పందం కుదుర్చింది. ఈ ప్రాజెక్ట్‌లో రెండు సంస్థలు కలిపి సుమారు రూ.18,000 కోట్ల రూపాయలు ఈక్విటీగా పెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఈ సహకారంలో టీపీజీ ఒక్క ఈక్విటీ భాగస్వామి. సంస్థ .8,820 కోట్లు పెట్టుబడిగా ఇస్తుంది. ఇందులో TPGకి 27.5–49 శాతం వరకు వాటా ఉంటుంది.
డేటా సెంటర్ల రంగంలోకి...
టీసీఎస్ ఇటీవలే డేటా సెంటర్ల రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. మొత్తం ఒక గిగావాట్ సామర్థ్యాన్ని ఐదు ఏళ్లలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మొత్తం పెట్టుబడిసుమారు రూ.57,600 కోట్లువసరమవుతుందని వివరించింది. ఈ కేంద్రాలు నవి ముంబయి, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో నెలకొననున్నాయి. అవసరాన్ని బట్టి టీసీఎస్, టాటా గ్రూప్ భూములను ఉపయోగించడమో, కొత్త భూములు కొనుగోలు చేయడమో చేయనున్నారు. టీపీజీతో భాగస్వామ్యం వల్ల షేర్హోల్డర్లకు మెరుగైన రాబడులు వస్తాయని, టీసీఎస్ పెట్టుబడి భారాన్ని తగ్గించుకునేందుకు ఇది సహాయపడుతుందని సంస్థ తెలిపింది.
వివిధ ప్రాంతాల్లో...
భారతదేశంలో జీడబ్ల్యూ స్థాయి ఏఐ డేటా సెంటర్లను నిర్మించే ఈ ప్రయాణంలో టీపీజీ చేరడం ఆనందంగా ఉందని, పెరుగుతున్న ఏఐ డిమాండ్ నేపథ్యంలో తమ హైపర్స్కేలర్లు, AI సంస్థలతో భాగస్వామ్యాలు మరింత బలపడతాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అన్నారు. ఈ సామర్థ్యంతో టీసీఎస్ తన కస్టమర్లకు పూర్తి ఏఐ పరిష్కారాలను అందించగలదని ఆయన చెప్పారు.భారత్‌లో డేటా లోకలైజేషన్ విధానాలు, వేగంగా పెరుగుతున్న డిజిటల్ వినియోగం కారణంగా అంబానీలు, అదానీలు సహా పలు పెద్ద సంస్థలు జీడబ్ల్యూ స్థాయి డేటా సెంటర్ ప్లాన్లు ప్రకటించాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనాలు వినపడుతున్నాయి.
Next Story

