Fri Mar 20 2026 15:50:17 GMT+0530 (India Standard Time)
Silver Prices : భారీగా పతనమయిన వెండి
వెండి ధరలు భారీగా పతనమయ్యాయి

వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఈరోజు కిలో వెండి ధర లక్షా ముప్ఫయి వేల రూపాయలు పడిపోయింది. కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పతనమవుతున్నాయి. కేజీ వెండి ధర ఏకంగా 1,30,000 రూపాయలు పడిపోయి 2,90,000 రూపాయలు పలికింది. వెండి మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పతనం పెట్టుబడిదారులలో ఆందోళన కలిగిస్తోంది.
నాలుగు లక్షల నుంచి...
కిలో రూ.4 లక్షల మార్కును తాకిన వెండి.. కేవలం ఒక్క రోజులోనే 25 శాతం( కుప్పకూలి రూ. 2,90లక్షల స్థాయికి చేరడం మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద దిద్దుబాటుగా నిలిచింది.అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు వెండిని కొనుగోలు చేయడం సురక్షితం కాదని అంటున్నారు. ధరలు పెరగడంతో ఉన్న వెండిని విక్రయిస్తుండటం, డిమాడ్ పడిపోవడంతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. బంగాంర ధరలు కూడా భారీగా తగ్గాయి.
Next Story

