Thu Dec 18 2025 07:39:08 GMT+0000 (Coordinated Universal Time)
Anil Ambani : అనిల్ అంబానీకి 25 కోట్లు జరిమానా
పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి సెబీ షాక్ ఇచ్చింది. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది

పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి సెబీ షాక్ ఇచ్చింది. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అనిల్ అంబానీకి ఇరవై ఐదు కోట్ల రూపాయల జరిమానాను విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ నిధులను దారి మళ్లించారని ఈ చర్యలకు దిగింది. అనిల్ అంబానీ సంస్థలతో పాటూ మరో 24 సంస్థలపై కూడా నిషేధం విధించడం సంచనలంగా మారింది.
నిధులు మళ్లించారని...
నిధులను మళ్లించినందునే ఈ చర్యలకు దిగినట్లు సెబీ తెలిపింది. ఈ ఐదేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎటువంటి కార్యక్రమాల్లో పొల్గొన కూడదని పేరుకొంది . రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ పై మాత్రం ఆరేళ్ల పాటు నిషేధం విధించడమేకాకుండా ఆరు లక్షల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
Next Story

