Sat Mar 28 2026 11:44:21 GMT+0530 (India Standard Time)
ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి.. వాహనం కొనుగోలు చేస్తే?
వాహనాలు కొనుగోలు చేయడానికి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి

వాహనాలు కొనుగోలు చేయడానికి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కొత్త నిబంధనలన్నీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వాహనాలు, స్థిరాస్తులు వంటి పెద్ద కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు జరుగనున్నాయి.
కొత్త నిబంధనలు:
ఇకపై రూ.5 లక్షలకు పైబడిన బైక్, స్కూటర్, ఇతర వాహనాలను కొనుగోలు చేస్తే తప్పనిసరిగా మీ పాన్ కార్డు వివరాలు తెలియజేయాలి.
గతంలో ద్విచక్ర వాహనాలకు ఎంత ఖరీదైనా పాన్ అవసరం లేదు. ఇప్పుడు రూ.5 లక్షలు దాటితే తప్పనిసరి.
కార్లు వంటి ఇతర వాహనాలకు మాత్రం ముందే పాన్ తప్పనిసరిగా ఉంది.
ఇతర మార్పులు:
బ్యాంక్ ఖాతాలో ఒకసారి రూ.50 వేలు కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే పాన్ వివరాలు ఇవ్వాలి.
కానీ, ఇప్పుడు ఒక ఏడాదిలో రూ.10 లక్షలు డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా పాన్ ఇవ్వాలి.
హోటల్, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లలో బిల్లు లక్ష లోపలైతే పాన్ అవసరం లేదు.లక్ష దాటి బిల్ ఉంటే మాత్రం పాన్ అవసరం.
స్థిరాస్తి (ఇల్లు లేదా భూమి) కొనుగోలు, అమ్మకాల పరిమితిని ఇప్పటి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు.
మరికొన్ని మార్పులు:
హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలను "క్యాటగిరీ 1" మెట్రో నగరాలుగా గుర్తించనున్నారు.
దీంతో ఈ నగరాలో పనిచేసే ఉద్యోగులకు ఇండ్ల అద్దె భత్యం అలవెన్సు పెరుగుతుంది.
Next Story

