Mini Solar AC: కారులో మినీ సోలార్ ఏసీ.. ఇది ఎలా పని చేస్తుంది... చౌక ధరలో..
వేసవి కాలంలో కారులో ప్రయాణించడం కొంచెం కష్టమే. మండుతున్న ఎండల కారణంగా కారులోపల ఉష్ణోగ్రత విపరీతంగా

వేసవి కాలంలో కారులో ప్రయాణించడం కొంచెం కష్టమే. మండుతున్న ఎండల కారణంగా కారులోపల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి భరించలేనంతగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి చాలా మంది వ్యక్తులు కారులోని ఏసీని ఉపయోగిస్తున్నారు. కానీ ఏసీని నడపడం వల్ల కారు శక్తిపై ఒత్తిడి పడుతుంది. అంటే ఏసీ పనిచేస్తే పెట్రోల్, డీజిల్ ఎక్కువ ఖర్చవుతుంది. దీంతో కాలుష్యం కూడా పెరుగుతుంది. అందువల్ల మీకు చల్లటి గాలిని అందించే మినీ సోలార్ ఏసీ గురించి తెలుసుకోండి.
కారు కూల్‌గా ఉండేలా సరికొత్త మినీ సోలార్ ఏసీ మార్కెట్లోకి వచ్చింది. ఇది మీ కారును చల్లబరచడమే కాకుండా పర్యావరణానికి కూడా మంచిది. ఇది సౌరశక్తితో నడిచే మినీ ఏసీ. ఇది ఎలా పని చేస్తుంది..? ఎంత ఖర్చవుతుంది అనే మొత్తం సమాచారం గురించి తెలుసుకుందాం.
మినీ సోలార్ ఏసీ ఎలా పని చేస్తుంది?
ఈ AC చిన్న సోలార్ ప్యానెల్, ఫ్యాన్లతో తయారు చేయబడి ఉంటుంది. సోలార్ ప్యానెల్ సూర్యకాంతి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ విద్యుత్తు ఫ్యాన్లను నడుపుతుంది. ఫ్యాన్లు తిరిగేటప్పుడు కారు లోపలికి చల్లటి గాలి వస్తుంది. మీరు దానిని కారు అద్దానికి వేలాడదీయవచ్చు. దాని సోలార్ ప్యానెల్లో కొంత భాగం కారు వెలుపల ఉంటుంది. అయితే కూలర్లో కొంత భాగం కారు లోపల ఉంటుంది.
మినీ సోలార్ ఏసీ ప్రయోజనాలు:
పర్యావరణ అనుకూలమైనది: ఈ ఏసీ పెట్రోల్ లేదా డీజిల్ నుండి ఉత్పత్తి చేయబడిన శక్తితో పనిచేయదు. అందుకే దీని వల్ల ఎలాంటి కాలుష్యం ఏర్పడదు.
పొదుపు: ఈ ఏసీ విద్యుత్తుతో పనిచేయదు. అందుకే కారు బ్యాటరీ తగ్గిపోతుంది.
పోర్టబుల్: ఈ ఏసీ చాలా చిన్నది. తేలికగా ఉంటుంది. దీనిని తీసుకెళ్లడం కూడా సులభంగానే ఉంటుంది. పెద్దగా బరువు ఉండటం, పెద్దాగా ఉండటం అంటూ ఉండదు.
సులభమైన ఇన్స్టాలేషన్: దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా సులభం. దీన్ని కారు అద్దానికి వేలాడదీయవచ్చు.
మినీ సోలార్ ఏసీ ధర ఎంతో తెలుసా?
మీరు మీ కారును చల్లగా ఉంచడానికి కొత్త మార్గం కోసం చూస్తున్నట్లయితే, మినీ సోలార్ AC మంచి ఎంపిక. ఈ మినీ సోలార్ ఏసీ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో రూ.4,415కి అందుబాటులో ఉంది. ఇది అమెజాన్‌లో అందుబాటులో ఉంది. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కొనుగోలు చేయవచ్చు .

