Fri Dec 05 2025 21:07:37 GMT+0000 (Coordinated Universal Time)
యాపిల్ స్టోర్ ముందు క్యూ లైన్
ఐఫోన్ 17 విక్రయాలు నేటి నుంచి ప్రారంభమవుతాయని చెప్పడంతో పెద్ద సంఖ్యలో యువకులు యాపిల్ స్టోర్స్ వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు

ఐఫోన్ చేతిలో ఉంటే చాలు.. నేటి యువతరానికి అంతకు మించి వేరే అక్కరలేదు. ఐ ఫోన్ ఒక్కసారి తమ సొంతం చేసుకోవాలని భావిస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు యాపిల్ సంస్థ ఐ ఫోన్ లేటెస్ట్ వర్షన్ తో కొత్త మోడల్స్ ను విడుదల చేస్తుంటుంది. తాజాగా యాపిల్ సంస్థ ఐఫోన్ 17 మోడల్‌ను విడుదల చేసింది.
ఐఫోన్ 17 విక్రయాలు నేటి నుంచి...
ఐఫోన్ 17 విక్రయాలు నేటి నుంచి ప్రారంభమవుతాయని చెప్పడంతో పెద్ద సంఖ్యలో యువకులు యాపిల్ స్టోర్స్ వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. ఐ ఫోన్ కోసం ముంబయి, ఢిల్లీలోని యాపిల్ స్టోర్ల ముందు పెద్ద సంఖ్యలో క్యూ లైన్ విస్తరించి ఉంది. ఈరోజు ఉదయం నుంచే స్టోర్ల వద్ద కస్టమర్లు క్యూ కట్టి మరీ వేచి యాపిల్ ఫోన్ ను సొంతం చేసుకునేందుకు వేచి ఉన్నారు.
Next Story

