Thu Apr 09 2026 13:17:25 GMT+0530 (India Standard Time)
Gold Rates : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. భారీగా తగ్గడంతో పసిడిప్రియులకు ఊరట లభించినట్లయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు తగ్గడంతో తమకు అవసరమైన బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడానికి వీలవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు ధరలు ఇలా...
24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధరపై 2,340 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,51,480 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2,150 రూపాయల మేరకు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,850 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధరపై ఐదు వేల రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర 2,60,000 రూపాయలకు చేరుకుంది.
Next Story

