Fri Apr 10 2026 11:12:49 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరిక
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గత నెలలో రెండు లక్షలు దాటిన బంగారం ధర ప్రస్తుతం లక్షా నలభై వేల రూపాయలకు చేరింది. దాదాపు అరవై వేల రూపాయలు ఒక్క నెలలోనే తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా మూడు లక్షలు గత నెలలో దాటేసింది. ప్రస్తుతం రెండు లక్షల అరవై వేల రూపాయలకు చేరింది. అంటే దాదాపు నలభై వేల రూపాయలు తగ్గింది. దీంతో బంగారం, వెండి పై పెట్టుబడి పెట్టేవారు వెనుకంజ వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పశ్చిమాసియాలో యుద్ధం నిలిచిపోయి, కాల్పుల విరమణకు అంగీకరించడంతో ధరలు పెరిగే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి.
యుద్ధం జరిగినంత కాలం...?
బంగారం, వెండి ధరలు విచిత్రంగా యుద్ధాలు జరిగినప్పుడు పెరుగుతుంటాయి. కానీ అమెరికా- ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. మిగిలిన ధరలు పెరుగుతుంటే బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం మదుపు చేసే వారు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టకపోవడమే. అలాగే మరొకవైపు డాలర్ బలహీనపడటంతో పాటు అమెరికాతో పాటు అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనడం కూడా బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు. అయితే యుద్ధం ఆగడంతో ఇక ధరలు పెరుగుతాయని అంటున్నారు.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారం కొనుగోలు చేసే వారికి ఇది తీపికబురు. రోజుకు ఎంతో కొంత ధర తగ్గుతూ కొంతలో కొంత ఊరట కలిగిస్తుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,840 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 1,51,470 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 2,59,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

