Tue Feb 03 2026 06:36:39 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బంగారం, వెండి కొనుగోలుకు ఇది సరైన సమయమేనా?
నిన్నటి వరకూ పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి

నిన్నటి వరకూ పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. అయితే ధరలు పతనమవుతాయని తెలుసు కాని ఒక్కసారిగా పతనమవ్వడంతో పెట్టుబడి పెట్టిన వారు మాత్రం నష్టాల పాలవుతున్నారు. ఇంకా ధరలు పెరుగుతాయని చాలా మంది బంగారం, వెండి వస్తువులపై పెట్టుబడులు పెట్టారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు కిందకు చూస్తుండటంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. అయితే మళ్లీ ధరలు పెరిగే అవకాశముందని, ఇప్పుడే పెట్టుబడులను తీసుకోవద్దని బిజినెస్ నిపుణులు పలువురు సూచిస్తున్నారు.
ధరల పతనానికి...
బంగారం, వెండి ధరల పతనానికి అనేక కారణాలున్నాయి. . వెండి ఎప్పుడూ బంగారం కదలికలను మరింత వేగంగా అనుకరిస్తుంది. అందుకే బంగారం కంటే వెండిలో పతనం మరింత తీవ్రంగా ఉంది. ధరలు గరిష్ట స్థాయికి చేరగానే భారీ ఇన్వెస్టర్లు, హెడ్జ్ ఫండ్లు ఒక్కసారిగా తమ లాభాలను నగదుగా మార్చుకోవడం ప్రారంభించారు. ఒకేసారి భారీగా అమ్మకాలు జరగడం వల్ల ధరలు కుప్పకూలాయి. వెండి ధరలు అమాంతం పడిపోవడంతో ఇప్పుడు కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. వెండి మార్కెట్లో పతనం ఇప్పుడే ప్రారంభమైంది. అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా 'లాభాల స్వీకరణ' జరుగుతుండటంతో ధరలు మరింత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది
నేటి ధరలు...
బంగారం, వెండి మార్కెట్ స్థిరంగా కొనసాగుతుంది. అందుకే ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఈ పతనంతో మార్కెట్ లో అనేక మంది నష్టపోయారంటున్నారు. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,40,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,53,160 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,99,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. అయితే మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో ఇంకా మార్పులు జరిగే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

