Fri Dec 05 2025 11:32:56 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : దిగిరాని బంగారం.. వెండి ఇంకా ప్రియంగానే
బంగారం ధరలు దూసుకు పోతున్నాయి. వెండి ధరలు కూడా చేతికి చిక్కడం లేదు

బంగారం ధరలు దూసుకు పోతున్నాయి. వెండి ధరలు కూడా చేతికి చిక్కడం లేదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన బంగారం, వెండి వస్తువులు ఇప్పటికే కొన్ని ప్రధాన వర్గాలకు దూరమయ్యాయి. మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు బంగారం, వెండి కొనుగోలు చేసే శక్తి లేకుండా పోయింది. ఆ రేంజ్ లో ధరలు పెరిగాయి. ఏనాడూ చూడని విధంగా ధరలు మండిపోతుండటంతో బంగారం కొనుగోలు చేయాలంటే భయమేసే పరిస్థితి ఏర్పడుతుంది. కలవారి కొంగుబాంగారంగా గోల్డ్ మారింది. అంతే తప్ప అందరికీ అందుబాటులో లేకపోవడంతో బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లోనూ కొనుగోళ్లు పెద్దగా లేకపోవడంపై వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు చేసేందుకు...
ఏ వస్తువయినా .. ప్రజల కొనుగోలు శక్తి ప్రకారం ధరలు పెరిగితే దానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. వాటిని కొనుగోలు చేయాలనుకుంటారు. అప్పుడు అమ్మకాలు ఊపందుకుంటాయి. కానీ బంగారం విషయంలో మాత్రం పూర్తి రివర్స్ లో జరుగుతుంది. ఈ ఏడాది బంగారానికి పూర్తిగా రెక్కలు వచ్చినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభమయిన పెరుగుదల ఇప్పటి వరకూ ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంది. పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలు చేరుకోవడానికి ఇక పెద్దగా సమయం పట్టకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే వెండి కిలో రెండు లక్షల రూపాయలకు చేరుకుని కొంత మేరకు దిగి వచ్చింది.
తగ్గుతున్నా...
ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్ లో బంగారం, వెండి వస్తువుల కొనుగోళ్లు ఎక్కువగా ఉండాలి. కానీ ఆశించిన రీతిలో అమ్మకాలు లేవని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో స్వల్పంగా బంగారం ధర తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,570 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,81,900 రూపాయలుగా కొనసాగుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులుండే అవకాశముంది.
Next Story

